భవిష్యత్తులో అమరావతికి రానున్న సినిమా రంగం
అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు
సినిమా రంగంలో భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుంది
మొదట్లో సినిమా రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేది.. తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినా ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే సినిమా రంగానికి కీలకంగా ఉండేది
హైదరాబాద్ జనాభా కోటి దాటి పోయి అక్కడ సినిమా రంగానికి ఆదాయం పెరిగింది.. దీంతో ఆ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యం విస్తరించింది
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. తెలుగు సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తోంది
విదేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాల తయారీ, పంపిణీ జరుగుతోంది
అయినా ఆదాయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌దే ప్రముఖ స్థానం
భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చు – సీఎం చంద్రబాబు