రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 30:- మెదక్ జిల్లా రామాయంపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గా నవీన్ గౌడ్ నూతనంగా ఎన్నికైన శుభ సంధర్భంగా బిజెపి పట్టణ కార్యాలయంలో మెదక్ బిజెపి నియోజకవర్గం ఇన్చార్జి,నిజాంపేట మాజీ జడ్పీటీసీ సభ్యులు పంజా విజయ్ కుమార్ ను శాలువా,పూలమాలలతో సన్మానం చేసి స్వీట్ లు పంచటం జరిగింది.ఈ సంధర్భంగా పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని,పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ,పార్టీ క్యాడర్ ను సమన్వయం చేస్తూ,ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రజలలోకి పార్టీని మరింత తీసుకుపోవడానికి కృషి చేయాలని అన్నారు.మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నవీన్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతను అనుసరించి పార్టీ బలోపేతానికి తాను అన్ని విధాల కృషి చేస్తానని ఆయన తెలిపారు.అదేవిధంగా తాను మండల అధ్యక్షుడిగా ఎన్నికైనందున మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్చార్జి పంజా విజయ్ కుమార్,నందా రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియపరచారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, పట్టణ బిజెపి అధ్యక్షులు అవినాష్ రెడ్డి,భానుచందర్,చింతల శేఖర్,కొడపర్తి నరేందర్,కటికే కార్తీక్, దయానంద రెడ్డి,భరత్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.