+91 95819 05907

వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో చేసిన బెడ్, డైనింగ్ టేబుల్.

మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే..!!

ఆయనే మన జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

ఈ మధ్య ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేశారు. వచ్చీ రావడంతోనే రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని చిత్తు చేసి పాలిటిక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తన బెడ్ రూము లోకి అడుగుపెట్టిన వెంటనే మొత్తం “వెండి” అనే ఫీలింగ్ తనకు రావాలనే ఉద్దేశంతో..తన అభిరుచులకు అనుగుణంగా తన పడకగది మొత్తం నింపేశామని ఆయన చెప్పారు.

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పట్టభద్రుడైన అనిరుధ్.. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో చదివారు. ఆ తర్వాత.చాలాకాలం పాటు ఉద్యోగం చేసి ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోనూ తనదైన మార్కును చూపిస్తున్న అనిరుధ్…ఇటీవలే తనకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే పోలీసు బలగాల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు సెక్యూరిటీ ఎందుకు అంటూ ఆయన నేరుగా జిల్లా ఎస్పీకే తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

 Don't Miss this News !