నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఓ రైతు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ బూతు పురాణం అందుకున్న వీడియో వైరల్ కావడం… దానిని పల్స్ న్యూస్ రిపోర్టర్ ఆ రైతును ఇంటర్వ్యూ చేయడం… అది సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ కావడంతో రేవతి అరెస్టుకు కారణమైంది.ఈ రోజు
ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ చేశారు.
జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు
రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసిన పోలీసులు.
కాగా మహిళా జర్నలిస్ట్ అరెస్టుపై బీ ఆర్ ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా జర్నలిస్ట్ రేవతికి మద్దతు పలికారు. తక్షణమే ఆమెను బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్టులతో అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని వారు దుయ్యబట్టారు
