నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న ఈ ప్రఖ్యాత సంస్థ నూతనంగా కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు గారిని నియమించడం గర్వకారణం.
వెల్లంకి వెంకటేశ్వరరావు గారు కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో న్యాయ విద్య అభ్యసించారు. 1992లో కొత్తగూడెం బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా నమోదు అయ్యారు. న్యాయ రంగంలో ఆయనకు విస్తృత అనుభవం ఉండటంతో, సింగరేణి సంస్థకు న్యాయ పరంగా విశిష్ట సేవలు అందించేందుకు ఈ నియామకం ఎంతో మైలురాయిగా నిలవనుంది.
సింగరేణి సీ&ఎండి డాక్టర్ బలరాం నాయక్ గారికి మరియు సింగరేణి సమస్థ డైరెక్టర్స్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వెల్లంకి వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా వెల్లంకి వెంకటేశ్వరరావు గారి నియామకాన్ని హర్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గారు
అభినందనలలో టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, సీనియర్ న్యాయవాదులు బాబురావు, విజయకుమార్, పురుషోత్తం, జీవికే మనోహర్, జీవీ ప్రసాద్, కె. పుల్లయ్య, గణేష్ బాబు, ఉదయ భాస్కర్, కోటం రాజు, బార్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, మనుబోతుల సత్యనారాయణ, పోసాని రాధాకృష్ణ, వీ.వి. సుధాకర్, వై.వి. రామారావు, నాగిరెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.