నేటి గదర్ న్యూస్, వెబ్ డెస్క్:
SC వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు,మిలిటెంట్ తరహా పోరుకు
మాలలు సిద్ధంగా ఉండాలి అని మాలల రాష్ట్ర అధ్యక్షులు
పిల్లి సుధాకర్ హెచ్చరించారు.
ఇక మాల జాతి కోసం ప్రాణాలైనా అర్పించే సమయం ఆసన్నమైంది ,తమ జాతిని ఇప్పుడు…
రాబోయే భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఎలాంటి పోరాటాల కైనా మాల జాతి సిద్ధంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం మాదిగ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్ట నేపథ్యంలో మాల రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Post Views: 108