నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రధాని నరేంద్రమోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం లో 12 లక్షల లోపు, పన్ను మినహాయింపు ఇచ్చినందుకుగాను, రైతులకు పంట రుణాలు మూడు నుంచి 5 లక్షల వరకు పెంచినందుకుగాను, మరియు 60 సంవత్సరాలు పైబడిన వారికి , జీరో పన్ను మినహాయించినందుకు గాను, జిల్లా పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ఉపేందర్, సుబ్బారావు, భద్రం, గుత్తా వంశీ,రవీందర్, కృష్ణ చారి, దాసరి మధు, శ్రీనివాసరెడ్డి, సురేష్ గౌడ్, రజిని రెడ్డి, శ్రీకాంత్,నాగమణి,నాగేశ్వరావు, గాంధీ, మోహన్, సాయి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
