– జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్
– లక్ష డప్పులు,వేల గొంతుకలకు రూ. 15వేలు ఆర్థిక సాయం
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుని అందిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీలోని ఎదులాపురం ఎస్సీ కాలనీ వాసుల కోరిక మేరకు లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి రూ. 15 వేలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం అజరామరమైనదని కొనియాడారు. నాటి నుంచి తన జాతి కోసం భుజంపై వేసిన నల్ల జెండాని మార్చకుండా అలుపెరగని పోరాటం చేశారన్నారు. అందులో భాగంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకోవడం గొప్ప విషయం అన్నారు. జస్టిస్ షమీం అత్తర్ ఏకసభ్య కమిషన్ ప్రక్రియ ఆధారంగా అసెంబ్లీలో ప్రత్యేక భేటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి చర్చించబోతుందన్నారు. తమ న్యాయమైన సమస్య కోసం మాదిగ, ఉపకలాలు చేస్తున్న లక్ష డబ్బులు వేల గొంతుకలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొక్కు రాజు , యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తేలూరి రవి, ఎస్సీ కాలనీ సభ్యులు పొన్నెకంటి రామకృష్ణ, టేకుమట్ల శ్రీను, మేళ్లచెరువు రవి, మేళ్లచెరువు సురేష్, మేళ్లచెరువు నరేష్, పొన్నెకంటి రమేష్, పొన్నెకంటి చక్రవర్తి, పొన్నెకంటి అఖిల్, మామిడాల కిరణ్, ఏర్పుల మురళి, ఎల్లయ్య, బంక మధు తదితరులు పాల్గొన్నారు.