నేటి గదర్ న్యూస్ ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం:
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గా గుమాస్ .ముత్తయ్య, ఏదులాపురం. గోపాలరావు లను పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో జరిగిన గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా మహాసభలో ఎన్నుకున్నట్లు టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సభలో జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతినెల జీతాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు చెల్లించాలని, అర్హత కలిగిన పంచాయతీ గుమాస్తాలను సహాయ కార్యదర్శులుగానియమించాలని,గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర తీర్మానాలను చేసినట్లు తెలిపారు.