నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లో ఒక్క ఒరిస్సా రాష్ట్రం కు చెందిన మహిళకు అత్యవసర పరిస్థితుల్లో లో రక్తం అవసరం పడడంతో వెంటనే స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వల్లెప అనీల్ కుమార్ రక్త దానం చేసి తన మానవత్వం చాటుకున్నాడు…. అలాగే ఖమ్మం జిల్లా లో ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న పెదా ప్రజలకు అండగా ఉండాలి అని, రక్త దానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు, *ఖమ్మం లో సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సికెల్ సెల్ అనీమియా తో మరియు తలసేమియా తో చిన్న పిల్లలు బాధపడుతున్నారు అని గుర్తుచేశారు. ఆ చిన్నారుల కోసం రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్ని స్వచ్ఛంద సంస్థలని కోరారు.*
ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి, ఖమ్మం టౌన్ సభ్యులు ఉపేందర్,రఘు సాయి కిరణ్, అమన్ పాల్గొన్నారు.
