★గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలి…
★సిఐటియు జిల్లా నాయకులు : సత్రపల్లి సాంబశివరావు.
మణుగూరు మార్చి 7: మణుగూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని,సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాసరావుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా పాలనలో పంచాయతీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు.2025 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ మూడు నెలలు కావస్తున్న వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలను,వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 19న 149 కోట్ల రూపాయలు విడుదల చేసింది కానీ పంచాయతీల ఎకౌంటు నుండి పంపిన చెక్కులు ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోవడంతో కార్మికులకు వేతనాలు అందని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల ఎకౌంటు నుండి వేతనాలు చెల్లించేందుకు వీలు లేకుండా పంచాయతీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజింగ్ చేయడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోయిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆయన అన్నారు.ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఒక పూట పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడిశాల రాములు. సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల వెంకన్న Gp జిల్లా నాయకులు రంగా. సదానందం. వెంకటేశ్వర్లు. పొడుతూరి రాములు. తదితరులు పాల్గొన్నారు.