బాధితుల తరఫున ఎమ్మార్వో కి వినతిపత్రం
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 07: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లో తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ శుక్రవారం దమ్మపేటలో డిప్యూటీ తాసిల్దార్ కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దమ్మపేట మండలం గొర్రె గుట్ట గ్రామానికి చెందిన వాడే బంగారి అనే వ్యక్తి 2008 లో చనిపోవడం జరిగినదనీ అతను పుట్టు పుర్వం నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఇతర వ్యక్తులు 2021 లో కుటుంబ సభ్యులకు తెల్వకుండా దొంగ పట్టా పాస్ బుక్ తయారు చేయించుకోవడం జరిగినదని, ఇలా దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేయడానికి పాల్పడే వ్యకులపై మరియు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందనీ, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు వారి భూములను మీ పేరు మేధ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరారు, కొందరు వ్యక్తులు కొందరు అధికారులతో కుమ్మక్కై దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేసినట్టు తెలిసింధని, ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి అక్రమ పాస్ బుక్కులు తయారి కొనసాగిస్తున్నారో వారిని గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తంబళ్ల రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తంబళ్ల రవి, ప్రసాద్, కొలికపోగు కాంతారావు, భూషణం, వాడేలక్ష్మి, వాడే కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.