*వరంగల్ జిల్లా*
*07 మార్చ్ 2025*
కులవృత్తి తో పాటు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేద పద్మశాలి కుటుంబాల సంక్షేమం కొరకు కూడ ఆలోచన చేయాల్సి ఉన్నది తెలంగాణ సాధన ఉద్యమం లో పాల్గొని ఉపాధి కోల్పోయిన వారికి మరియు పాల్గొన్న వారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన వివిధ తెలంగాణ అసోసియేషన్ ల పద్మశాలి కులం నకు చెందిన ఫౌండర్స్ కు గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. గతం లో కుల వృత్తి చేసి పద్మశాలియులు ప్రస్తుతం ఇతర పనుల పై ఆధార పడిన వారికి కూడా 50 సంవత్సరాల వయసు దాటిన వారికి పింఛన్ పథకం అమలు, ఉపాధి కోసం ఆర్ధిక సహాయం,తెలంగాణ సాధన ఉద్యమం లో పాల్గొన్న వారికి ప్రభుత్వంచే తగిన గుర్తింపు ఇప్పించుట , ఇల్లు లేని వారికి ఇండ్లను ఇప్పించుట , లేక 62 గజాలు స్థలం అయినా ప్రభుత్వం ఇప్పియాలని, మొదలగు సంక్షేమ పథకాలు పద్మ శాలి కులస్థులకు ప్రాధాన్యత తో ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి న్యాయం చేయాల్సిన భాద్యత కూడ కుల సంఘాలపైన ఉన్నది,50 సంవత్సరాలు వయసు దాటినా కూడా స్థిర నివాసం ఇల్లు లేని వారికి ప్రభుత్వం చొరవ చేసుకొని ఇందిరమ్మ ఇళ్లయిన ఇచ్చేలా చూడగలరని పద్మశాలి కోరుతున్నారు. ఉపాధి లేక ఇతర పనులు చేసుకుంటు జీవిస్తున్న కులవృత్తేతర పద్మశాలి కుటుంబాల పరిస్థితి గురించి ఆలోచన చేయాలని
ప్రభుత్వము సహకారం తో పద్మశాలి నిరుపేద కుటుంబాలను ఆదుకునేటట్లు ప్రభుత్వం, కుల సంఘాలు కార్యాచరణ చేయాలని కుల వృత్తేతర పద్మశాలి కుటుంబాలు రామ రాజేష్ నేత , సారంగుల బాలసుబ్రమణ్యం నేత, మెతుకు ఉప్పలయ్య తదితరులు కోరుచున్నారు.