+91 95819 05907

విద్యనే మహిళా సాధికారతకు అసలైన ఆయుధం – మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రాణి

*విద్య మాత్రమే కాదు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి- మోటివేషనల్ ట్రైనర్ సుమలత*

*మార్చి 7*

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బేటీ బచావో – బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహభరితంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బాలికల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా విద్య, బాల్య వివాహాల నివారణ, ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధన వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే,అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ A. భాస్కర్ సూచనలతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు
*చైల్డ్ మ్యారేజ్ పై విద్యార్థులకు అవగాహన – మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రాణి*
ఈ అవగాహనా సదస్సులో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును నాశనం చేస్తాయి. చిన్న వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పైగా, చిన్నతనంలో వివాహం చేసుకోవడం వల్ల వారి చదువు అర్ధాంతరంగా నిలిచిపోతుంది. ఇది వారి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.చైల్డ్ మ్యారేజ్‌కి ప్రోత్సహించిన వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాంటి పెళ్లిళ్లు చట్టబద్ధంగా అక్రమమని పరిగణించబడతాయి. బాలికలు తమ స్వంత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలంటే, ముందుగా వారు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలి. స్వయం సమృద్ధి సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలి. జీవితాన్ని సమర్థవంతంగా నిర్మించుకోవాలంటే విద్య అత్యంత కీలకం” అని ఆమె వివరించారు.
*విజయానికి క్రమశిక్షణ అత్యవసరం – మోటివేషనల్ స్పీకర్ సుమలత*
ఈ కార్యక్రమంలో మోటివేషనల్ ట్రైనర్ సుమలత మాట్లాడుతూ విద్యార్థులకు విలువైన మార్గదర్శకతను అందించారు.
“మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం ఎంతో అవసరం. తల్లిదండ్రులు, గురువులు ఇచ్చే మార్గదర్శకతను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సుస్పష్టంగా నిర్దేశించుకోవాలి. ముఖ్యంగా పరీక్షలకు ముందు మాత్రమే చదవడం కాకుండా, రోజూ క్రమంగా చదవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి రోజు ఏకాగ్రతతో చదవడం వల్ల విజయం సులభమవుతుంది.ఇటీవల విద్యార్థుల్లో ఒత్తిడి, భయం పెరుగుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. విజయం అనేది ఒక్కరోజులో సాధించదగినది కాదు. దీని కోసం నిరంతరం కృషి చేయాలి. చెడు అలవాట్లను, చెడు ప్రభావాలను దూరం ఉంచాలి. సమాజంలో గౌరవాన్ని పొందాలంటే నిజాయితీ, క్రమశిక్షణ, మంచి ప్రవర్తనతో కూడిన జీవనశైలి అలవర్చుకోవాలి” అని విద్యార్థులకు సుమలత సూచించారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఎటీడిఓ కమర్ హుస్సేన్, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నాగసుధ, ఉపాధ్యాయులు,అధ్యాపకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !