+91 95819 05907

నేటి గదర్ స్టోరీ ఐటమ్ 🌾🌾🌾పొలాలు ఎండి పాయే… గుండె తరుక్క పోయే★పుట్టెడు దుఃఖం లో రైతన్న

★ ఎకరానికి వేల పెట్టుబడి పెట్టె
★ చేతికొచ్చే సమయానికి పొలాలు నెర్రలు బాసే
★ఎండిన చెరువుల
★ పడిపోయిన గ్రౌండ్ వాటర్
★ కొరవడిన ప్రభుత్వం ముందుచూపు
★ రైతన్నలను చైతన్యం చేయడంలో విఫలం
★ మేల్, ఫీమేల్ సీడ్స్ మూలంగా బాగా పెరిగిన సాగు విస్తీర్ణం
★ రైతన్నను ప్రభుత్వ ఆదుకోవాలి
★నేటి గదర్ ప్రత్యేక కథనం
✍️KDR

నేటి గదర్ న్యూస్,పినపాక: రైతుకు కష్టకాలం వచ్చింది… ఎకరాకు వేల పెట్టుబడి పెట్టి వ్యవసాయం సాగు చేస్తే తీరా నోటికాడికి వచ్చాక పొలాలు నెర్రెలు బస్తున్నాయ్… పలుచోట్ల కంకులు వెళ్లబట్టినప్పటికీ…. సరిపడ నీటి సౌకర్యం లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం రైతులకు ఈ దుస్థితి నెలకొంది. రైతుల దిన గాధ పై నేటి గద్దర్ ప్రత్యేక కథనం.యాసంగి వరి పంట వేసిన రైతులకు పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. బోర్లు సహాయంతో యాసంగి పంట పండుతాయి అన్న ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం లాగానే పినపాక మండలం లో ఈ సంవత్సరం కూడా యాసంగి వరి సాగు చేసిన రైతులకు నీళ్లు రాక చెరువులో నీరు ఎండిపోవడంతో పొలాల్లో ఉన్న బోర్ల లో నీరు లేక వరి ఎండిపోతుంది. చేతికి వచ్చే సమయంలో పంట కళ్ళముందే ఎండిపోతుంటే, నీరు కోసం ఎదురుచూస్తున్న రైతును ప్రభుత్వ అధికారులు, పెద్దలు కనికరించడం లేదని వాదన వినిపిస్తోంది. మండల పరిధిలోని పినపాక ,గడ్డంపల్లి, జానంపేట, తో గూడెం, గోపాలరావుపేట, పొట్లపల్లి, టీ కొత్తగూడెం తదితర గ్రామాలలో రైతన్న వేల ఎకరాలలో వరి సాగు చేశారు. తొలినాళ్లలో నీరు సమృద్ధిగా ఉండడంతో వరి చేళ్లు ఏపుగా పెరిగాయి. తీరా వరి చేళ్లు ఈని కంకి బయటకు తీసే సమయానికి సరిపడా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇప్పటికీ వరి పొలానికి అధిక మొత్తంలో ఖర్చు చేసి ఉన్నారు. వరి విత్తనాలు జల్లిన మొదలు దూకితుండడం, వరి నాటడం, మందులు పిచికారి చేయడం వీటన్నిటికీ కలిపి ప్రతి ఎకరాకు దాదాపుగా రూ.30 వేల వరకు రైతు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. పంట వస్తదనుకున్న సమయంలో వరి పొలాలు ఎండిపోతుండడంతో రైతన్నకు ఏమి పాలు పోవడం లేదు. దీనితో రైతన్న పుట్టెడు దుఃఖంతో రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోవడం, చెరువులు ఎండిపోవడం లాంటి విషయాలు రైతన్న గోసకు కారణమయ్యాయి. అలాగే ఉమ్మడి పినపాక మండలంలో మేల్ ఫిమేల్ సీడ్స్ మూలంగా సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. ఆయా కంపెనీలు రైతులకు ముందుగానే పెట్టుబడి ఎరవేసి నాటు పెట్టిస్తున్నారు. దీనితో వారు ఆడ మగ వరి నాటగా అనేకమంది రైతులకు సరిపడా నీరు సౌకర్యం లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ముందే మేల్కొని రైతులకు అవగాహన కల్పించి ఉంటే బాగుండదని రైతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది రైతులు అత్యధిక పెట్టుబడులు పెట్టడం మూలంగా అప్పుల ఊబిలో కూరుకు పోయారు. పంట చివరి దశకు రావడంతో నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !