★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు
★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన వైరా పట్టణంలో గల సుందరయ్య నగర్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధ మహిళను కాళ్లు చేతులు కట్టివేసి చోరీ కి పాల్పడిన సంచలన కేసులో మంగళవారం నలుగురు నిందితులను వైరా పోలీసులు పట్టుకున్నారు. వైరా ACP రెహమాన్ పర్యవేక్షణలో వైరా సీఐ సాగర్, వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్, తల్లాడ ఎస్, మరియు పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీచేపడుతుండగా నెమలి- దాసాపురం ఆంధ్ర, తెలంగాణ అయిన రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని విచారించగా ఫిబ్రవరి 12వ తేదీన వృద్ధ మహిళ ఇంటిలోకి చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు ఈ నలుగురు నిందితులు కారుకు నకిలీ నెంబర్ ప్లేట్ తో మధ్యాహ్నం పూట ఆ వృద్ధ మహిళ ఇంటికి వెళ్లారు అందులో ఒకరు పోలీసు దుస్తులు ధరించి ఉన్నాడు. ఆమెతో నీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడు అనిఇంట్లో చోరీ చేయాలని నెపంతో ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఆమె కాళ్లు చేతులు కట్టి కట్టివేసి నోటికి పాస్టర్ అంటించి నెట్టిపడేశారు.ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలను దోచుకుని,బీరువా తెరిచి అందులో సొమ్ము, బంగారం దోసుకెళ్లారు. ఈ నిందితులలో A1 గా రాయపాటి వెంకన్న, అలియాస్ వెంకన్న,అలియాస్ దొంగల వెంకన్న,అలియాస్ వెంకటేష్, అలియాస్ రెడ్డి, కాగా ఇతనిపై మొత్తం 30 కేసులు ఉన్నాయిA2 నాగుల్ మీరా ఇతడు పై పది కేసులు ఉన్నాయి A3 గా ముత్తు, అలియాస్ ముత్తు మురుగేషన్ ఇతనిపై 11 కేసులు ఉన్నాయి.A4 గా విజయ్ కుమార్ ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. అని వైరా పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.ఇది ఇలా ఉండగా నిద్రాహారాలు మాని ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు.