*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.*
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్
మెదక్ జిల్లా నేటి గద్దర్ (జిల్లా ప్రతినిధి) భూపాల్ మార్చి 11.
మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామ శివారులో కోటి పదిలక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని 10 సంవత్సరాలలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి 14 నెలలలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారుచేసి విద్య వైద్యానికి ప్రాముఖ్యతనిస్తూ మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు, 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని 25 ఎకరాలలో ఈ పాఠశాలను నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయ సారథి,మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, సుధాకర్, నాయకులు అంజా గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, షేక్ అక్బర్,చిరంజీవి, రామయ్య, శ్రీనివాస్, బాలేష్, లక్ష్మయ్య, మహేష్, లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, పెంట రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, రాజు, నెల్లూరు తదితరులు పాల్గొన్నారు.