నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది వరకు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన గౌరవనీయులు *తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క కి* గ్రామస్తులు, రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు
ఈ రోడ్డు విస్తరణ ద్వారా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో మేలు కలుగనుంది. గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఈ అభివృద్ధి పనులకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇంతకాలంగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు ఈ రోడ్డు విస్తరణతో తీరనున్నాయి. భట్టి విక్రమార్క సహాయ సహకారాలు మాకు ఎనలేని మద్దతునందించాయి” అని తెలియజేశారు.
రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేయాలని కోరుతూ, అభివృద్ధి పనులకు అండగా ఉంటామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
–