రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్లాట్ల యజమానులకు ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోని 25% రాయితీ పొందంవచ్చని తెలిపారు.దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి తేది మార్చి 31, 2025 వరకు చెల్లించాలన్నారు.2020 సంవత్సరములో వెయ్యి రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ కొరకు రిజిష్టర్ చేసుకున్న ప్లాట్లు యజమానులకు అనుమతిలేని లే అవుట్లలోని ఖాళీ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకొనుటకు ఈ సదవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు.అనుమతి లేని లే ఆవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి,మిగతా కానీ, వాటిని కూడా సబ్ రిజిష్టర్ కార్యాలయము నందు రిజిస్ట్రేషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ రుసుము చేల్లీంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.ఈ అవకాశాన్ని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
.
