*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు పత్రాలు అందించారు.* ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం ఆదాయం, అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతినెలా తెలంగాణ ఆదాయం 18 వేల కోట్లు ఉంది.
ప్రతి నెలా ఖర్చులు మాత్రం 22 వేల కోట్ల వరకు ఉంటున్నాయి.
*జీత భత్యాలకు 6 వేల 500 కోట్లు ఖర్చవుతుంది.*
*రాష్ట్ర అప్పులకు మరో 6 వేల 500 కోట్లు ఖర్చవుతున్నాయి.*
*మిగిలిన 5 వేల కోట్ల రూపాయలతోనే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది..*
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని పథకాలకు ప్రాముఖ్యత తగ్గించాల్సి వచ్చింది*
ఏం చేయట్లేదని , దిగిపోమని బీఆర్ఎస్ అంటోంది.
ఐదేండ్లు సీఎంగా ఉండాలని ఎన్నుకుంది మీరే కదా
దిగిపో దిగిపో అని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది..
లక్ష కోట్లు పెట్టి కడితే కట్టుడు కూలుడు అయ్యింది..
*కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం*
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
అప్పులు, వడ్డీల భారం మేము మోస్తున్నాం
ఆర్థిక పరిస్థితి మీ కళ్లముందు ఉంది
*జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి*
ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే
ప్రభుత్వం దగ్గర ఉంటే వాటిని ప్రజలకే ఇస్తామని.. దాచుకోవటానికి ఏమీ లేదన్నారు. *రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీ ముందే ఉంచుతున్నాను.. మీరు ఏం చెబితే అలాచేద్దాం అంటూ* ప్రజలనుద్దేశించి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.