రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా రామాయంపేట శివారులో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించగా 20 ఎకరాల స్థలాన్ని 1421 సర్వే నెంబర్ లో మంగళవారం రోజు మండల తహసిల్దార్ రజనీకుమారి, ఏఈ శ్రీనివాసులు,మాజీ డిఈ నరసింహ చారి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రజనీకుమారి.ఆర్ఐ గౌస్. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 151