◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని
*ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!*
*తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు గుగులోతు సూర్యప్రకాష్* పిలుపుమేరకు* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని* విద్యార్థులకు పిలుపునిచ్చారు….
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై, విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యావత్ విద్యార్థి లోకమంతా జయప్రదం చేయాలని, శాస్త్రీయ విద్య విధానం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించడానికి భవిష్యత్తు కార్య చరణ ప్రకటించుకుని ప్రవేట్ విద్యా వ్యవస్థ పై యుద్ధం చేయడానికి పునుకున్నది…
ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం డిఎస్ఎఫ్ఐ కృషి చేస్తుంది అని, విద్యాకై పోరాడు ఉపాధికై పోరాడు నినాదంతో ముందుకు వెళుతుందని తెలిపారు… అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి ఆగదమ్యగోచరంగా ఉందని,తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించలేదని మండిపడ్డారు.. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు…….
*తెలంగాణలో జరుగుతున్న ఆవిర్భావ సభకు ఆంధ్రప్రదేశ్ నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నామని రంగ నాయక్ తెలిపారు….*