*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, ఈనెల 18వ తారీకు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పి డి ఎస్ యు కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి భానోత్ నరేందర్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో కడపత్రాలను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సంగ్ పరివార శక్తులతో కలిసి యు జి సి నూతన ముసాయిదారు రూపొందించి ఉమ్మడి జాబితాలో పొందుపరిచి విద్యారంగాన్ని తన గుప్పింట్లో ఉంచుకునే విధంగా చేస్తుందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు విద్యారంగాన్ని ధారా దత్తం చేసేందుకు కుట్రలు పన్నుతుందని అన్నారు. 18న జరిగే సదస్సుకు విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆశ జ్యోతి, నందిని, శ్వేత, పూజిత, తదితరులు పాల్గొన్నారు
Post Views: 77