👉తెలంగాణ ప్రజా కళాకారుడు సిద్దెల హుస్సేన్ డిమాండ్,,..
పినపాక : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులకు సంపూర్ణ ఉపాధిని కల్పించే ” రాజీవ్ యువ వికాస పథకంలో తెలంగాణ ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ ప్రజా కళాకారుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు సిద్దెల హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ, మలిదశలో ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నారని, గత ప్రభుత్వం ఉద్యమకారులకు ఎటువంటి ఉపాధి అవకాశాలను కల్పించలేదని, పోలీస్ కేసులే మిగిలాయని అన్నారు, కోటి ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ ని, తెలంగాణ ప్రజలు భుజాన వేసుకుని అధికారంలో కూర్చుండబెట్టారు, అందులో తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలు కీలక పాత్ర పోషించాయన్నారు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారుల కోసం, వారి సంక్షేమం కోసం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించాలని, యువత ఉపాధికి పెద్ద పీట వేసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా, ఉద్యమకారులకు యూనిట్లు కేటాయించాలన్నారు. తద్వారా తెలంగాణలోని ఉద్యమకారులకు కొంతమేర ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఉంటుందని తెలియజేశారు.
