నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి,
చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవ సమితి బాధ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోపించాలని అన్నారు.. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ సేవా సమితి అండగా ఉంటుందని అన్నారు… ఈ కార్యక్రమంలో చిన్నమండవ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెట్టి రాంబాబు, ఉపాధ్యాయులు పుల్లారావు, నాగేశ్వరావు ,ఖాన్ , పూర్ణచంద్రరావు,మంజుల,
సునీల రాణి, ఉషా, అంబేద్కర్ సేవ సమితి సభ్యులు గుండ్ల రాంబాబు, గుడిది పిచ్చయ్య, బాబు , జాని, సుధాకర్ రెడ్డి సుధీర్ గ్రామ పెద్దలు మోర్ల కృష్ణ , గుండ్ల ప్రవీణ్
తదితరులు పాల్గొన్నారు….