+91 95819 05907

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

మణుగూరు : విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ
రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థు
లకు కనీస సౌకర్యాలు కల్పించా
లని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించ
వద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నా
యన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రు
లకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్య
యన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థు
లు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,
అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,
కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర టూ తెలంగాణ అక్రమ ఇసుక రవాణా? చోద్యం చూస్తున్న అధికారులు!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం రహదారి నుంచి ఖమ్మం వెళ్లే రహదారి వైపు అక్రమ ఇసుక లారీ పోలీసులు పట్టుకున్న వైనం అర్ధరాత్రులు

Read More »

బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చట్టరీత్యా చర్యలు :,మంత్రి పొంగులేటి

★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు *ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన

Read More »

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్

Read More »

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మణుగూరు : విద్యార్థుల నుంచి

Read More »

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

 Don't Miss this News !