★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు
*ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను చట్టరీత్యా శిక్షిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కిరణ్ ను మంత్రి పొంగులేటి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఎదురుపడి కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా లేక వెనుక నుంచి తమ పార్టీ నాయకుల పై కొంతమంది ప్రతిపక్ష నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా మంగళగూడెంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోజడ్ల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుమారుడు బొజడ్ల రవికుమార్ ని ఓదార్చారు. పార్టీ తరుపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎం.వి. పాలెం లో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. అంతకుముందు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండాలో ఇటీవల మృతి చెందిన ధరావత్ కిషోర్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.*