నేటి గదర్ న్యూస్,పినపాక:
పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల కు ఏడుళ్ల బయ్యారం శ్రీవిద్య కాలేజీ , రాధికా కాన్సెప్ట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్ గంగిరెడ్డి నిరోషా చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు జ్యామెంటరీ బాక్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ నాగయ్య గారు, శ్రీవిద్య కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రవిప్రసాద్ రెడ్డి గారు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 15