+91 95819 05907

ట్రైబల్ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీఓ

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పెయింటింగ్ చిత్రాలతోపాటు గిరిజన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ నిర్మాణం మరియు బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు శనివారం వరకు పూర్తి చేసి మ్యూజియమును విద్యుత్ కాంతులతో సర్వ సుందరంగా అలంకరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి, బోటింగ్ ప్రదేశాలు బాక్స్ క్రికెట్ గ్రౌండ్, మ్యూజియం లోపల చిత్రీకరణ జరుగుతున్న పెయింటింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నందున శ్రీసీతారాముని కళ్యాణ వేడుకలు తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించే విధంగా సన్నాహాలు చేస్తున్నందున, ఏ ఒక్క పని మిగలకుండా పూర్తిస్థాయిలో అన్ని పనులు పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం చిన్నారుల బోటింగ్ సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ మరియు గిరిజనుల ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాల పనులు శుక్రవారం లోగా పూర్తి కావాలని అన్నారు. సందర్శకులు సాంప్రదాయమైన గిరిజన వంటకాలు చవిచూడడానికి ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ రేపటిలోగా పూర్తి కావాలని, అలాగే ప్రస్తుతం మ్యూజియంలో ఉన్న వాష్ రూమ్ టాయిలెట్స్ ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని ఈఈ ట్రైబల్ చంద్రశేఖర్ కు ఆదేశించారు. ఇంకా ఏమైనా గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో వేయించాలని, మ్యూజియం ప్రవేశద్వారం దగ్గర గిరిజన పల్లెల్లో ఉండే రచ్చబండ పెయింటింగ్ పూర్తిస్థాయి డిజైన్ గా వేయించాలని, స్వాగత ద్వారం పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో పార్కింగ్ పనులు ప్రారంభించాలని అన్నారు.
అనంతరం గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఎ సి ఎం ఓ రమణయ్య, డి ఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఏ ఈ రవి, ఈవో జిపి శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర టూ తెలంగాణ అక్రమ ఇసుక రవాణా? చోద్యం చూస్తున్న అధికారులు!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం రహదారి నుంచి ఖమ్మం వెళ్లే రహదారి వైపు అక్రమ ఇసుక లారీ పోలీసులు పట్టుకున్న వైనం అర్ధరాత్రులు

Read More »

బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చట్టరీత్యా చర్యలు :,మంత్రి పొంగులేటి

★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు *ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన

Read More »

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్

Read More »

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మణుగూరు : విద్యార్థుల నుంచి

Read More »

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

 Don't Miss this News !