దమ్మపేటలో మిన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు
ప్రజల మనిషి కేసీఆర్: రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 17: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, కార్యకర్తలతో కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు; అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశానికే ఆదర్శంగా నిలిపిన ధీశాలి కేసీఆర్ అని, రాబోయే రెండేళ్లలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంబరాల్లో సోయం వీరభద్రం, దారా మల్లికార్జునరావు, దారా యుగంధర్, ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, జలగం వాసు, చీకట్ రామారావు, రావుల శ్రీను, అబ్దుల్ జిన్నా సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో యువజన విభాగం సభ్యులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.








