+91 95819 05907

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి*
*కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు*
నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని రాయాలని చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్ద దించే వరకు కార్మిక కర్షక ఐక్య పోరాటాలు ఆగవని మోడీ నిరంకుశ విధానాలపై కార్మికులకు ఉన్న వ్యతిరేకత దేశవ్యాప్త సమ్మెతో మరోసారి ప్రపంచానికి తెలియజేసిందని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు స్పష్టం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కరకగూడెం మండల అన్ని స్కీమ్ ల వర్కర్ల,కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తహశీల్దారు వట్టం కాంతయ్యకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సమ్మెలో భాగంగా ఆశవర్కర్లు,అంగన్ వాడి,మద్యాహ్న భోజన, ప్రభత్వ శానిటేషన్,గ్రామపంచాయతి కార్మికులు స్వచ్చందంగా పాల్గొని ప్రదర్శన నిర్వహించి సమ్మెను విజయవంతం చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటినుండి ఒక్కొక్కటిగా కార్మిక హక్కులను కాలరాస్తూ చివరి అస్త్రంగా కార్మిక చట్టాలను చట్టాలను సైతం రద్దు చేశారని ఆయన అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకురావటమే కాకుండా కార్మికులను విభజించి పాలించే విధంగా యూనియన్ లను పెట్టే అవకాశాన్ని కూడా లేకుండా మోడీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను పునర్దించాలని మోడీ సర్కార్ దిగి వచ్చేవరకు సిఐటియు ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సమ్మెతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవకపోతే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ నాయకులు భవానీ, స్వరూప, సుజాత, శిరీష, మంగతాయరు,గ్రామపంచాయతి కార్మికులు గుమ్మడవెల్లి.కృష్ణ,దనుంజయ్,చర్ప.సాంబశివరావు, రమాదేవి, సావిత్రి ,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

 Don't Miss this News !