*కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..*
**పోరాడి సాధించిన తెలంగాణ లో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ నీళ్ల పోరాటం*
*నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం*
*తెలంగాణ బలం. గళం.దళం బిఆర్ఎస్*
*తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కు ఎంతటి దాకా నైనా పోరాటం*
**రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి..తెల్ల కాగితం మీద అంకెలు రాసినట్టే ఉంది*
*భద్రాచలం గుడి అభివృద్ధి కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి*
*సమావేశంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునిల్ కుమార్*
నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు కోలా రాజు అధ్యక్షతనసోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు *ఆకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ* కృష్ణా జలాల పరిరక్షణకై రేపు నల్లగొండలో జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
పోరాడి సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పాలన లో మళ్లీ నీళ్ల పోరాటం మొదలైందని కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రానికి ఏ విధంగా కాంగ్రెస్ అప్పచెప్పుతుందని విమర్శించారు.. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని పదేపదే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉంటే మరి బడ్జెట్లో ఎందుకు భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించలేదు వివరణ ఇవ్వాలని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేసే బాధ్యత నుండి తప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా తెల్ల పేపర్ పై అంకెలు రాసిన చందంగా ఉందని అన్నారు..
ఈ సమావేశంలో కోటగిరి ప్రభోద్ కుమార్. గుంజ ఏడుకొండలు. బత్తుల నరసింహులు. లంకపల్లి విశ్వనాథ్. దన్నాన తరుణ్. చెన్నకేశవ. కొల్లిపాక శివ గుంజ బాబు. ప్రసాద్ .అయినాల రామకృష్ణ . అర్జున్ తదితరులు ఉన్నారు