+91 95819 05907

మల్టీ వర్కర్స్ బతుకులు గాలిలో దీపాలేనా?

మల్టీ వర్కర్స్ బతుకులు గాలిలో దీపాలేనా?
* పంచాయితీలు ఏర్పడిన నాటి నుండి ఇవే బతుకులు
* పాలకమండలి మారిన ప్రతిసారి ఉద్యోగాలు ఊస్ట్
* శ్రమ దోపిడి తప్ప వారి కష్టాలు పట్టని పాలకులు
* మంత్రి సీతక్క పై గంపెడు ఆశలు పెట్టుకున్న పంచాయతీ కార్మికులు
* మల్టీపర్పస్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసంIFTU అలుపెరగని పోరాటం
* మల్టీపర్పస్ వర్గాలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి
*IFTU రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి కుమార్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం లోని పంచాయతీల లో వేకువజామున ప్రతి ఇంట్లో,పరిశరాల్లో సేకరించిన చెత్త ను పంచాయతీ మల్టీ పర్పస్ కార్మికులు ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలిస్తూ ఉంటారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం,మొక్కలను సంరక్షించడంలో వారి పాత్ర ఏనలేనిది. కరోనా లాంటి కష్టకాలంలో వారు ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధ్యత కుటుంబాలకు విశేషమైన సేవలందించారు. అందరూ కష్టాలు తీర్చే వారి పరిస్థితి మాత్రం గాలిలో దీపాల వలేతయారయింది. పాలకులు మల్టీపర్పస్ వర్కర్ పేరుతో వారితో ఊడిగం చేయించుకుంటున్నారు తప్ప వారి పతికులకు మాత్రం ఎలాంటి భరోసా లేదు. నేటి గధర్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో 13 వేల పంచాయతీ లలో 60 వేల మల్టీ పర్పస్ కార్మికులను తాత్కాలిక పద్ధతిన ప్రభుత్వ నియమించింది. వారితో ఆయా పంచాయతీలకు సంబంధించిన వివిధ పనులకు వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా చెత్త సేకరణ, మొక్కల పెంపకం, బ్లీచింగ్ నిర్వహణ తదితర పనులు వీరి ఆధ్వర్యంలో చేపడుతారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారు పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది. ఎప్పుడు వారి ఉద్యోగాలు ఉంటాయో? పోతాయో? తెలియని పరిస్థితి. పాలకమండలి మారిన ప్రతిసారి మల్టీపర్పస్ ఉద్యోగస్తులను అకారణంగా తొలగించడం జరుగుతుంది. ఆయా పాలక మండలికి అనువైన వ్యక్తులను తిరిగి నియమించుకుంటున్నారు. దీనితో వారికి మరల ఉపాధి దొరకడం కష్టంగా మారుతుంది. ఉన్న తాత్కాలిక కొలువు కోల్పోయి మరొకటి దొరకక వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. పంచాయతీలు ఏర్పడిన నాటి నుండి పంచాయతీ కార్మికుల పరిస్థితి ఇంతే. ఏ ఒక్క పాలకుడికి వీరి గోస పట్టలే. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల మల్టీ పర్పస్ కాంటాక్ట్ కార్మికులు కోరుతున్నారు. మంత్రి సీతక్క తవ కష్టాలు తీరుస్తుందని గంపెడు ఆశతో ఉన్నారు.

మల్టీపర్పస్ పంచాయతీ కార్మికుల ప్రధాన డిమాండ్లు:
1. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని మొత్తాన్ని పర్మినెంట్ చేయాలి.
2, పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ ను వేతనంగా చెల్లించాలి, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్లీపర్ లకు 15,600/_, బిల్ కలెక్టర్ ,కారోబర్లకు, 19500/_కంప్యూటర్ ఆఫ్టర్లకు 22,750/-వేతనంగా నిర్ణయించాలి.
3, గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి, ఈ గ్రాంట్ నుండే వేతనాలు చెల్లించాలి.
4. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రతిపాదికన పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి.
5, ప్రతి నెల రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలి. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి.
6, జీవో నెంబర్ 51ను సవరించాలి, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి, వివిధ కేటగిరీలన్నింటిని కొనసాగించాలి.
7, కారాపూర్ బిల్లింగ్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి, వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలి.
8, వర్కర్ కు ఇన్సూరెన్స్ రూ 5 లక్షలు అమలు చేయాలి. ప్రమాద బీమాగా రూ 10 లక్షలు ఇవ్వాలి, దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలి.
9, వయసు మీరిందని సాకుతో కార్మికులను మారిస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఐదు లక్షలు ఇవ్వాలి.
10, ఏడాదికి మూడు జతల యూనిఫాం,చెప్పులు, సబ్బులు, నూనెలు, ఇవ్వాలి. వాటికి నగదు రూపంలో అలవెన్సులు చెల్లించాలి.
11, పీఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 8 గంటల పనిని అమలు చేయాలి. ఆదివారం, పండుగ సెలవులు,జాతీయ, అంతర్జాతీయ సెలవు దినాలను అమలు చేయాలి.
12, కార్మికులపై రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి.
*మల్టీపర్పస్ వర్కర్ల సమస్య పరిష్కరించాలి: IFTU మల్టీ పర్పస్ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి*
ఎన్నో బాధలు అనుభవిస్తూ గ్రామాల అభివృద్ధిలో మల్టీ పర్పస్ పంచాయతీ కార్మికులు అనేక సేవలు చేస్తున్నప్పటికీ వారిపట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని IFTU మల్టీ పర్పస్ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి ఆవేదన వెలిబుచ్చారు. వారి డిమాండ్ పరిష్కారం అయ్యేంతవరకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !