నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్(నల్గొండ): కృష్ణా జలాలను రేవంత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడంతో నిరసనగా టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్లగొండలో మంగళవారం నిర్వహిస్తున్న బహిరంగ సభకు వివిధ జిల్లాల నుండి ప్రజలు తరలి రావడంతో సభా ప్రాంగణం జన సంద్రాన్ని తలపిస్తుంది. ఇప్పటికే సభ వేదిక మీదకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ,బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,అశేష ప్రజానీకం హాజరయ్యారు.
Post Views: 70