*రేషన్ కార్డు లేక సంక్షేమ పధకాలకు దూరం అవుతున్న ప్రజలు
*తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత
– సామాజిక కార్యకర్త కర్నె రవి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఎందరో నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు, నూతన రేషన్ కార్డుల ఆన్లైన్ ప్రక్రియను చేపట్టాలని మణుగూరు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం మణుగూరు మండల తాసిల్దార్ ను కలిసి, మణుగూరు మండల వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను విడుదల చేయాలని వినతి పిత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్యారెంటీలకు తప్పనిసరిగా రేషన్ కార్డు కావాలని నిబంధన ఉన్నందున, ఎందరో నిరుపేదలకు రేషన్ కార్డు లేని కారణంచేత సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, కొత్తగా పెళ్లయిన యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన తాసిల్దార్ ను కోరారు.
