ఇసుక మాఫియా పై మైనింగ్ పోలీస్ అధికారుల మెరుపు దాడి
*భుర్గంపాహాడ్ బోర్డర్ లో ఇసుకను తరలిస్తున్న 15 లారీల పట్టివేత
* ఆంధ్ర నుండి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం
* తెలంగాణ ప్రభుత్వం పై వైసీపీ నేతల ప్రకటననే కారణమా?
* ఇసుక సూరుల్ల గుండెల్లో వణుకు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గుండాల నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు ఇసుకను తరలిస్తున్న 15 ఇసుక లారీలను తెలంగాణ మైనింగ్ , పోలీస్ శాఖ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ సీఎంవో అధికారుల ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున అధికారులు ఆకస్మిక దాడిలు నిర్వహించారు.
*అధికారులు పట్టుకున్న లారీ ల వివరాలు ఇలా ఉన్నాయి.*
ఐటిసి లారీ యార్డు ఎస్బిఐ సమీపంలో 2 లారీలు,
బిపిఎల్ స్కూల్ ఏరియాలో 3 లారీలు,
పుష్కర వనం ఏరియాలో 3 లారీలు,
క్రాస్ రోడ్ లో 4 లారీలు,
లక్ష్మీపురం పెట్రోల్ బంకు సమీపంలో సిమెంటు పోల్స్ పార్కింగ్ లో2 లారీలు…
రహదారి సమీపంలో కొన్ని లారీలు ఉన్నాయి. ఒక్కసారిగా అధికారులు ఇసుక లారీలపై ఆకస్మిక దాడులు చేయడంతో ఇసుక సురుల్లా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇటీవల కాలంలో ఆంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో బుధవారం జరిగిన దాడులకు ప్రాధాన్యత సంతరించుకుంది.
