నేటిగదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
విద్యుత్ తీగలను అడవిలో అమర్చితే కేసులు తప్పవు అని ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఆఫీసర్ తేజస్విని హెచ్చరించారు. బుధవారం పినపాక మండల పరిధిలో గల వలస ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ సిబ్బంది తో కలిసి అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యుత్ తీగలతో జంతవులును వేటాడిన వారికి పడే శిక్షలను వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది వ్యక్తులు విద్యుత్ తీగలను అమర్చి జంతువులను వేటడుతున్నారని అది తీవ్రమైన నేరమన్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం మూగజీవాలను వేటాడటం నేరమని, విచారణలో నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్షసైతం ఉంటోందన్నారు. సెర్చ్ లైట్లు ఉన్న, వేటాడే వస్తువులు ఉన్న అందజేయాలని కోరారు . అటవీ జంతువులను వేటాడే వారి సమాచారం తెలిస్తే అందజేయాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో DRO అరుణ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
