*రి. నెం:194/2022 కు పాన్ కార్డ్
*దాతల విరాళాలకు ఐటి మినహాయింపు
*నేటి వరకు 832 సేవా కార్యక్రమాలు 1లక్ష 38వేల లబ్ధిదారులకు రూ.75 లక్షల ఆర్ధిక వితరణ
*నేటి గదర్ న్యూస్ తో మీ కోసం మేము ఉన్నాము సహాయక సమితి ఫౌండర్ &చైర్మన్ లయన్ నీలి ప్రకాష్
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆ మండలంలో రెక్కడి తే డొక్కాడని బతుకులు కొందరివి. అనారోగ్యం భారి న పడిన, ఉన్నత చదువులకు వెళ్లాలన్న, ప్రకృతి వైపరీత్యాలతో సకలం కోల్పోయి వీధిన పడ్డ అనేక నిరుపేద కుటుంబాలు… వారి దీనగాదును ఎవరికి చెప్పాలో అర్థం కాని దుస్థితి… అలాంటి నిరుపేద కుటుంబాలకు మేమున్నామంటూ చర్ల మండలంలో ధైర్యం కల్పిస్తు, దాతల సహకారాలతో లక్షల మందికి అండగా నిలుస్తున్న చర్ల మండల మీకోసం మేమున్నాం సహాయక సమితి పై నేటి గదర్ న్యూస్ ప్రత్యేక కథనం. చర్లకు చెందిన లయన్ నీలి ప్రకాష్ కష్టాల్లో ఉన్న బాధిత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో మీకోసం మేమున్నాం సహాయక సమితిని ఏర్పాటు చేశారు. నీలి ప్రకాష్ ఆ సంస్థకి ఫౌండర్ గా చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటివరకు దాతల విరాళాలతో సమకూర్చిన సుమారు రూ.75లక్షలను 1లక్ష38 వేల మంది బాధిత కుటుంబాలకుఅందజేశారు. ఈ సంస్థ అభాగ్యులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు సేవా దర్పన్, BSS సంస్థ ద్వారా సేవ రత్న జాతీయ పురస్కారాలతో ఆ సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ ను సన్మానించారు. దీనిని బట్టి చూస్తే మీకోసం మేమున్నాం సహాయక సమితి ఏజెన్సీ నిరుపేద గిరిజన గిరిజన ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ సంస్థ నీతి అయోగ్ లో రిజిస్టర్ అయి ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థకు ఇటువంటి పాన్ కార్డు సైతం రావడం జరిగింది. సేవ గుణం ఉన్న వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు , ఆదాయ పన్ను కట్టే వారందరికీ మీకోసం మేమున్నాం సహాయసమితికి విరాళం అందజేసిన యెడల ఆ వితరణ సొమ్ముకు పన్ను మినహాయింపు ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు. దాతలు తమ సంస్థకు విరివిగా విరాళాలు ఇచ్చి నిరుపేద లకు అపన్నాహస్తం అందించాలనిఆయన కోరారు.
