*హలాల్ చేస్తే అమ్మవారికి మొక్కు చెల్లదు
*అలా చేసేవారు ఆలయానికి రావొద్దు
*మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన పూజారి సిద్ధిబోయిన అరుణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:: ఆసియా ఖండంలోనే అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే ఆదివాసి జాతర మేడారం. ఇలాంటి విగ్రహాలు లేకుండా వనదేవతలతో అత్యంత వైభవంగా ఈ జాతర ములుగు జిల్లా తడ్వాయి మండలం జరుగుతుంది. త్వరలోనే మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ శనివారం హలాల్ నిషేధం విధించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులు మేకలకు కోళ్లకు హలాల్ చేస్తే అమ్మవారికి మొక్కు చెల్లదని అన్నారు. అలా చేసేవారు ఆలయానికి రావద్దని తెలిపారు. హలాల్ చేయడం ఆదివాసి సాంప్రదాయం కాదన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి మేడారం జాతరకు సహకరించాలని కోరారు.
Post Views: 212