constable died in accident
నేటి గదర్ న్యూస్,ములుగు,వాజేడు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీసులో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ పొదేం కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నరు.విధి నిర్వహణ లో భాగంగా మృతుడు కోటేశ్వరరావు శనివారం రాత్రి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిధిలో సిగ్నల్ దాటవేస్తున్న క్రమంలో ద్వి చక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఢీ కొట్టింన ఘటనలో అక్కడికక్కడే కోటేశ్వరరావు మృతి చెందారు. అంత్యక్రియల కొరకువాజేడు మండలం మృతుడి స్వగ్రామం పెద్ద గొల్లగూడెం గ్రామం కు తరలించినట్లు పోలీసు శాఖ తెలిపారు. కోటేశ్వరరావు మరణ వార్త విన్న ఆయనకుటుంబంలో, స్వగ్రామంలో విషాదఛాయలనుకున్నాయి. మృతుడు కోటీశ్వరరావు 2009 సంవత్సరంలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు మృతుడికి భార్యసౌజన్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు