నేటి గదర్ న్యూస్,ములుగు(వాజేడు):
మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం లోని గంగారాం మండలం పునుగొండ్ల గ్రామములో పగిడిద్దరాజు దేవాలయం లో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదివారంప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి అన్నారు. మళ్ళీ వచ్చే జాతర సమయంలోపు పూనుగొండ్లలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న మేడారం మహాజాతరను విజయవంతం చేయాలని కోరారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అందరూ వచ్చి సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 20వ తేదీన పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు మేడారం బయల్దేరి వెళ్లనున్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెమ్ లచ్చు పటేల్,పూజారులుతో
పాటు స్థానిక ఎంపీపీ,జెడ్పీటీసీ లు మండల అధ్యక్షులు
ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
