*మీకోసం మేమున్నాం టీంప్రతీ ఆదివారం – అన్నదానం – 118 వ వారం*
అన్నదానం మహా దానం
దాతలకు కృతజ్ఞతలు
మీకోసం మేమున్నాం సహాయక సమితి ఫౌండర్ ,చైర్మన్ లయన్ నీలి ప్రకాష్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: అన్నదానం మహాదానం అని మీకోసం మేమున్నాం సహాయక సమితి ఫౌండర్, చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ అన్నారు. ప్రతి ఆదివారం వారాంతపు సంత కి వచ్చే నిరుపేదలకు ,ఆదివాసి గిరిజనులకు అనేకమంది దాతల ఆర్థిక వితరణతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఆదివారం అన్నదానం ఆదివారం నాటికి 118 వారం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.118 వ ఆదివారం అన్నదానం
కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు పరిటాల రామయ్య వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వితరణతో చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆకలితో ఉన్నవారికి మీకోసం మేమున్నాం సహకారం తో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ నేటి గదర్ న్యూస్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు పరిటాల వెంకట రమణ మాష్టారు, చలపతిరావు , శ్రీనివాస రావు, గణేష్ మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
