*డంపింగ్ యార్డు,కరకట్ట పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.తెల్లం
*స్లూయిజ్ మరమ్మత్తులు కూడా మొదలు పెట్టాలి
*అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ తాతా మధు లకు ధన్యవాదాలు
*భద్రాచలం సీనియర్ సిటిజన్ తాండ్ర వెంకట రమణ రావు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
2024 లో ఎన్నికల సందర్భంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇచ్చిన హామి మేరకు అత్యవసర పనులు డంపింగ్ యార్డు,కరకట్ట పనులను సోమవారం ప్రారంభిం భద్రాచలం ఎమ్మెల్యే ..Dr తెల్లం వెంకట రావు కు, సహకరించిన మంత్రులకు, Mlc తాత మధు కి అధికారులకు భద్రాచలం సీనియర్ సిటజన్ తాండ్ర వెంకట రమణ రావు భద్రాచలం ప్రజలందరి తరపున కృతజ్ఞతాభివందనలు తెలిపారు.మరల గోదావరి వరదలు వచ్చేలోపు, స్లూయిజ్ మరమ్మత్తులు కూడా మొదలు పెట్టేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకో వలసింది ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.
