ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర
మేడారం
శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలి
పినపాక తహశీల్దార్ కార్యాలయంలో…
వినతి పత్రం అందజేసిన
జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా నాయకులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర ,
కోట్లాదిమందికి కొంగుబంగారమై కోరికలను తీర్చే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను 1994 సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించినప్పటికీ నేటికీ సెలవు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు . ప్రపంచంలోనే వివిధ దేశాల నుండి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కోట్లాది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అయినా కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించకపోవడం ఆదివాసీలను అవమానపరచడమే అన్నారు. వెంటనే జాతర జరుగు ఫిబ్రవరి 21,22,23 తేదీలలో దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
గొగ్గల ఆర్కే దొర,పినపాక మండల అధ్యక్షులు
కొమరం శ్రీను,ప్రధాన కార్యదర్శి
కుర్సం సారయ్య,తదితరులు పాల్గొన్నారు.
