* కొమరం భీమ్ ప్రపంచ ఆదివాసి దినోత్సవం, శ్రీ సమ్మక్క సారలమ్మ పండగలను ఎందుకు జరుపుకోరు?
* కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదు
* ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించిన బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేయాలి
*సొందే మల్లు దొర
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(దుమ్ముగూడెం):ఏజెన్సీ లో ఉన్నటువంటి ఈ ఎం ఆర్ ఎస్ గురుకుల పాఠశాలలో సోమవారం లంబాడి సాంస్కృత జయంతి జరుపుకున్న ఈ ఎం ఆర్ ఎస్ గురుకుల పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి ఏ ఎస్ పి ఏవీఎస్పీ డిమాండ్ చేసింది. భద్రాచలం రాజుపేట కాలనీలో ఆ సంఘండివిజన్ నాయకులు రేసు ఆదినారాయణమూర్తి అధ్యక్షత ఏర్పాటైన సమావేశంలో ఎఎస్పీ, ఏవి ఎస్ పి డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ… ఉద్దేశ పూర్వకంగానే ఈఎంఆర్ ఎస్ గురుకుల పాఠశాలలో లంబాడి పండగలు జరుపుతూ ఆదివాసులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు .ఈనెల 14పాలవంచ కృష్ణ సాగర్ గాంధీ పురం భద్రాచలం టేకులపల్లి ,చర్ల ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడం జరిగిందన్నారు అంతే కాకుండా చర్ల ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ లో జరుపుతూ మత బోధనాల బోధించడం జరిగిందన్నారు .సంత్ సేవాలాల్ అడుగుజాడల్లో నడవాలని ప్రిన్సిపాల్ ఎం శకుంతల హితబోధనాలు ఇవ్వడం అనేది చాలా విడ్డూరమని ఆదివాసిల చరిత్ర లను చిన్న చూపు చూడడం జీర్ణించు కోలేక పోతున్న మని ఆగ్రహించారు తెలంగాణ రాష్ట్రంలో ఏ చరిత్ర లేని సంతు సేవాలాల్ కర్నాటక రాష్ట్రానికి చెందిన పుట్టపర్తి సాధు ఆయన జయంతి ఏజెన్సీలో ట్రైబల్ విద్యాసంస్థలలో ప్రభుత్వ ఉద్యోగుల గా ఉండి ఏ విధంగా జరుపుతారని ప్రశ్నించారు? గతంలో లేనిది ఇప్పుడు ఎలా! జరుపుతారు అని ఏజెన్సీ బాస్ పి ఓ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ సి ఓ గారేమో క్రిస్టియన్ కి సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పండగలు జరిపిస్తారు ఈఎంఆర్ ఎస్ అధికారులేమేా లంబాడి సంస్కృత పండగలు జరుపుకుంటారు అంటే ఆదివాసులు అంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాలకి సంబంధించిన పండగలు ట్రైబల్ పాఠశాలలో జరుపుకోమని పిఓ ఏమైనా ఆదేశాలు ఇచ్చినారా? సమాధానం చెప్పాలన్నారు కొంతమంది గిరిజనేతర్ల అధికారులకు ట్రైబల్ విద్య సంస్థల బాధ్యతలు అప్పగిస్తే సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు ట్రైబల్ పాఠశాలలలో మత బోధనలు పండగలు జరిపే సంస్థలా? లేక విద్యాబోధనలు నేర్పించే సంస్థలా? పిఓ సమాధానం చెప్పాలన్నారు తెలంగాణలో చరిత్ర కలిగిన వీరుడు గోండు బెబ్బులి కొమరం భీమ్ ప్రపంచ ఆదివాసి దినోత్సవం సమ్మక్క సార్లమ్మ పండుగలు జరుపుకోవడం చేతకాని వీళ్ళకి ట్రైబల్ మధ్య చిచ్చుపెట్టి మతాలకు సంబంధించిన పండుగలు జరుపుకునే అర్హత ఎవరు ఇచ్చారని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది.ఐ టి డి ఏ పి వో ఏకలవ్య రెసిడెన్సి మోడల్ స్కూల్లో సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాలు జరుపుకున్న పాఠశాల సిబ్బందిని తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే లంబాడీ లపై మరో ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు డివిజన్ ఉపాధ్యక్షుడు రేస్ తిరుపతి రావు కారం నాగేశ్వరావు పోడియం రామారావు పునేశ్వరరావు సోయం నాగేష్ వీరయ్య పాయం రామ్మూర్తి తదితరులుపాల్గొన్నారు.
