+91 95819 05907

మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్

*మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా గడ్డపై అడుగు పెట్టిన పోలీసులు
*కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన రెండవ రోజే కాకులు దూరని కారడవి హిడ్మా గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసిన పోలీసులు
* చత్తీస్గడ్ లో ఇప్పటికే మావోయిస్టు ల సొరంగ స్థావరాలు కనిపెట్టిన పోలీసు బలగాలు
*మావోయిస్టుల వ్యవసాయ భూముల స్వాధీనం
*చత్తీస్గడ్,ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ
* మావోయిస్టులు సీనియర్లను కోల్పోయి, కొత్త రిక్రూట్ రిక్రూట్మెంట్ లేక ఢీలా పడుతున్నారా?!
* ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఆదివాసీలు
* అలజడలకు ఆస్కారం!?
* దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధం
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. చత్తీస్గడ్ రాష్ట్రంలో కాకులు దూరని కారడవి లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా గ్రామంలో సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్లు ,పోలీసులు అడుగుపెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి భారత దేశంలో తీవ్రవాదులు, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన రెండు రోజుల అనంతరం పోలీస్ బలగాలు మావోయిస్టు హిడ్మా గ్రామంలో సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగరవేయడం దీనికి మరింత బలం చేకూరింది. సిఆర్పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు బాంబు అమర్చి హతమార్చిన అనంతరం కేంద్రం మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చతిస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై అత్యున్నత పరిజ్ఞానం వినియోగించుకుని సమాచారం సేకరించారు. ఒకవైపు మావోయిస్టు సానుభూతి పరులను గుర్తిస్తూ వారిని లొంగిపోయే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టు కీలక స్థావరాలను, సొరంగ మార్గాలను సిఆర్పిఎఫ్, ఆ రాష్ట్ర పోలీసులు కనుగొన్నారు. ఈ అంశాలు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారాయి. పోలీస్ బలగాలు మావోయిస్టు పార్టీ ఆర్థిక వనరులను సైతం దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే చతిస్గడ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మావోయిస్టులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. పలువురు మావోయిస్టు కొరియర్లు చందాలు వసూలు చేసుకుని వారికి చేర్చే క్రమంలో పట్టుబడుతున్నారు. ఈ అంశాలన్నీ మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారి. కరోనా కాలంలో మావోయిస్టు పార్టీ అతి ముఖ్య నేతలను ,చురుకైన వారిని కోల్పోయింది. దీనితో వారికి పెద్ద దెబ్బ పడింది. కొత్త రిక్రూట్మెంట్లు పెద్ద మొత్తంలో లేకపోవడం, కేంద్రం నిర్బంధం ఎక్కువ అవ్వడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని పలువురి వాదన. ఇది ఇలా ఉండగా దట్టమైన అడవిలోకి సిఆర్పిఎఫ్, మావోయిస్టు నిరోధక బలగాలు, పోలీసులు అడుగుపెట్టడంతో ఆ ప్రాంతాలలో యుద్ధ మేఘాలు అలమకున్నాయి. దీనితో గిరి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇరువర్గాల ఘర్షణల మూలంగా అలజడలు తలెత్తే ఆస్కారం మెండుగా ఉంది. అధునాతన పరిజ్ఞానం వినియోగిస్తూ పోలీస్ శాఖ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !