నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఆదివాసి ఉద్యోగుల సంస్కృతిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట లో మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మణుగూరు డివిజన్ అధ్యక్షులు పోలబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం జాతర, ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంమేడారం జాతరను అధికారికంగా నిర్వహించలన్నారు. వాహనాల రద్దీ కారణం గా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించాలని డిమాండ్ అలాగే ఆదివాసి గ్రామాల్లో ఉండే ప్రజలు ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగ సంఘ నాయకులు కొమరం కేశవరావు కన్నయ్య రామారావు నాగరాజు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
