నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: కరకగూడెం మండలం అనంతారం SC కాలనీకి చెందిన బోడ సౌజన్య (28) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మంగళవారం బోడ సౌజన్యపార్థివ దేహానికి నివాళులర్పించి,మృతురాలికుటుంబ సభ్యులను పరామార్శించి ధైర్యం చెప్పారు. అనంతరం సౌజన్య దహన సంస్కరాలకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో
మండల నాయకులు అత్తే సారయ్య , పూజారి వెంకన్న , ఆరెం నరసింహారావు , కొర్స బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60