నేటి గదర్ న్యూస్ ,భద్రద్రి కొత్తగూడెం ప్రతినిధి(కరకగూడెం):భద్రద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నూతన ఆర్టీసీ బస్టాండు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .మంగళవారం మణుగూరు లోని డిపో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణాల్లో బస్సు ఎక్కడం కోసం బస్టాండ్ సౌకర్యం లేక చెట్ల కింద షాపుల ముందు నిల్చుని పడి కాపులు కాస్తున్నారని మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ప్రజలకు నూతన బస్టాండ్ నిర్మాణానికి అధికారులు తక్షణమే చొరవ చూపాలని వారు సంబంధిత అధికారులను కోరారు బస్టాండ్ నిర్మాణం కొరకు సిపిఎం పార్టీ దశల వారి పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఊక నరసింహరావు పాల్గొన్నారు.
