నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం పట్టణం), 20 ఫిబ్రవరి,:
మంగళవారం:
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 25,26,27 తేదీలలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మా ఇంటి వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ ఇంఛార్జి మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ బిజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బీజేపీ సంకల్పయాత్ర ప్రారంభ భారీ బహిరంగ సభ, పదివేల మందితో ఈ నెల 25 ఆదివారం రోజున దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం పట్టణంలో జరగబోతుందని, ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ గారు హాజరుకానున్నారని, ఈ సభకు బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై భద్రాచలం పట్టణాన్ని కాషాయమయం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యాత్రా ప్రముఖ్ చాడా శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల చెర్వు శ్రీనివాసరావు, పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం నియోజకవర్గం యాత్ర ప్రముఖ్ బిట్రగుంట క్రాంతి కుమార్, బిజెపి భద్రాచలం పట్టణ అధ్యక్షులు రామ్మోహన్రావు, నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
